Home NewsGeneral విశాఖ ! క్యాపిటల్ సిటీ లో వై ఎస్ ఆర్ సి పి……….# maa visakha.

విశాఖ ! క్యాపిటల్ సిటీ లో వై ఎస్ ఆర్ సి పి……….# maa visakha.

by kishore226226@gmail.com

*శ్రీ కె కె రాజు గారి ఆధ్వర్యంలో వంటా వార్పు కార్యక్రమం* శాసనమండలిలో ఆంద్రప్రదేశ్ పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు వ్యవహరించిన ధోరణికి, ప్రసంగాలకు, విధానాలకు వ్యతిరేకంగా, తెలుగుదేశం పార్టీ విధానాలను ఖండిస్తూ ప్రభుత్వ ప్రతిపాదనలను స్వాగతిస్తూ ప్రభుత్వానికి సంఘీభావం తెలుపుతూ శనివారం ఉదయం విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త *శ్రీ కె.కె.రాజు గారు* ఆధ్వర్యంలో NH-5, తాటిచెట్లపాలెం జంక్షన్లో *వంటా-వార్పు* కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా *శ్రీ కె.కె.రాజు గారు* మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు అని విమర్శించారు.ఆ పార్టీ కి విశాఖ జిల్లా నుండి 4 MLAలను ప్రజలు గెలిపిస్తే ఈ విశాఖకు పరిపాలన రాజధాని రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ప్రజలు దృష్టిలో *చంద్రబాబు ప్రజా ద్రోహిగా* మిగిలిపోతారని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు సనపల చంద్రమౌళి గారు,రొంగలి జగన్నాధం గారు,గరికిన గౌరి, రాష్ట్ర,పార్లమెంట్,సిటీ, నాయకులు,మాజీ కార్పొరేటర్లు,వార్డు అధ్యక్షులు,అనుబంధ సంఘాల అధ్యక్షులు,బూత్ కన్వీనర్లు,కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

related posts