Home NewsGeneral విశాఖ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో గణతంత్ర వేడుకలు#maa visakha

విశాఖ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో గణతంత్ర వేడుకలు#maa visakha

by kishore226226@gmail.com

71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం నాడు ఉదయం 9 గంటలకు పోలీసు బారెక్స్ స్టేడియంలో జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ జాతీయ పతాకావిష్కరణ గావించారు. నగర పోలీస్ కమిషనర్ ఆర్.కె. మీనా, డి సి పి రంగారెడ్డి ఆయనకు సహకరించారు. అనంతరం కలెక్టర్ పరేడ్ ను పర్యవేక్షించారు. పోలీసు, హోంగార్డులు, ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్ కంటింజెంట్ లు కవాతు నిర్వహించాయి. తర్వాత కలెక్టర్ జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సవివరంగా ప్రసంగించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనడానికి విచ్చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యారావు ను పూలమాలతో సత్కరించారు. కార్యక్రమానికి విచ్చేసిన స్వాతంత్ర సమరయోధులను, అధికార, అనధికార ప్రముఖులను కలెక్టర్ ఆత్మీయంగా పలకరించారు. అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు, ఇతర పథకాల ను ప్రతిబింబించే శకటాలను ప్రదర్శించారు. వరుసగా వ్యవసాయ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, జల వనరుల శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా షెడ్యూల్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష అభియాన్, మత్స్యశాఖ, స్త్రీ శిశు అభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ, విశాఖ మహా నగర పాలక సంస్థ, విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ, పాడేరు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీశాఖ, పరిశ్రమల శాఖ, ఏపీ ఈపీడీసీఎల్ సంస్థలు తమ శకటాలను ప్రదర్శించాయి. వీటిలో మొదటి బహుమతి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ శకటానికి, రెండో బహుమతి వి ఎం ఆర్ డి ఎ శకటానికి, మూడవ బహుమతి స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ శకటాన్ని ఎంపిక చేయడం జరిగింది. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు దేశభక్తిని ప్రబోధించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. వరుసగా జూబ్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్, విశాఖ వ్యాలీ స్కూలు, సెక్రెడ్ హార్ట్ బాలికల స్కూలు, జ్ఞానాపురం, సెయింట్ జోసఫ్ కళాశాల విద్యార్థినులు, సన్ స్కూల్, భీమిలి, కస్తూరిబా గాంధీ విద్యాలయం, ఆనందపురం నుంచి బాల బాలికలు భారతదేశ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా వివిధ కళారూపాలను ప్రదర్శించారు. ఈ విద్యార్థినీ విద్యార్థుల బృందాలకు జిల్లా కలెక్టర్ ప్రోత్సాహకంగా మెమెంటోలు అందజేశారు. తర్వాత ఉత్తమ సేవలందించిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది కి జిల్లా కలెక్టర్ మెరిట్ సర్టిఫికెట్లను అందజేశారు. తదుపరి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ తరపున 48, 768 మంది లబ్ధిదారులకు రూ.978 లక్షల విలువైన చెక్కులను, పెళ్లి కానుక సర్టిఫికెట్లను జిల్లా కలెక్టర్ ప్రధానం చేశారు. పశు సంవర్ధక శాఖ కు సంబంధించి కలెక్టర్ వైయస్సార్ లైవ్ స్టాక్ నష్టపరిహారం కింద 187 మంది లబ్ధిదారులకు రూ.48 లక్షలు అంద చేశారు. వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ నుంచి 33 మంది లబ్ధిదారులకు రూ.360 లక్షల విలువైన వాహనాలను కలెక్టర్ అందజేశారు. 31 మంది విభిన్న ప్రతిభావంతుల కు రూ.5.69 లక్షల విలువైన ట్రై సైకిల్స్, ల్యాప్ టాప్ లు, కృత్రిమ అవయవాలను కలెక్టర్ అందజేశారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటుచేసిన స్టాళ్లను కలెక్టర్ పరిశీలించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ, వ్యవసాయ శాఖ, మత్స్యశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పాఠశాల విద్యాశాఖ, ఎస్సీ కార్పొరేషన్, మైనారిటీస్ కార్పొరేషన్, స్త్రీ శిశు అభివృద్ధి సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు ఎం వి వి సత్యనారాయణ, వి ఎం ఆర్ డి ఎ కమిషనర్ కోటేశ్వరరావు, జీవీఎంసీ కమిషనర్ సృజన, జాయింట్ కలెక్టర్లు శివ శంకర్, వేణుగోపాల రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ ప్రతిష్ట, రూరల్ ఎస్పీ అట్టాడ బాబూజీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

related posts