Home NewsCrime కలప అక్రమ తరలింపు

కలప అక్రమ తరలింపు

by kishore226226@gmail.com

పద్మనాభం, న్యూస్‌టుడే : విశాఖ నగరంలోని పలు ప్రాంతాలకు కాల్చిన ఇటుక ఎక్కువగా పద్మనాభం మండలం నుంచే వెళ్తోంది. వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్న ఇటుకల బట్టీలకు కలపను గత కొంతకాలంగా అక్రమంగా తరలిస్తున్నా యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఎటువంటి అనుమతులూ లేకుండా ఈ ప్రాంతంలోని చెట్లను ఇష్టారాజ్యంగా నరికి కలపగా మార్చి బట్టీలకు తరలిస్తున్నారు. అటవీశాఖ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పట్టించుకోకపోవడంతో టన్నుల కొద్దీ కలపను నిర్వాహకులు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం వాహనాల్లో తరలిస్తున్నా యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా చర్యలు తీసుకుని పచ్చదనాన్ని పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

related posts