Home NewsGeneral పోలీసుల త్యాగాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి

పోలీసుల త్యాగాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి

by kishore226226@gmail.com

విశాఖపట్నం, న్యూస్‌టుడే :  దేశ భద్రత, సమాజ శ్రేయస్సు కోసం శ్రమిస్తున్న పోలీసుల పనితీరు, వారి త్యాగాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ అన్నారు. కైలాసగిరి ఆర్మ్‌డ్‌ రిజర్వు ప్రధాన కార్యాలయంలో బుధవారం అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబారాన్ని ఎస్పీ ప్రారంభించారు. అనంతరం ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ మాట్లాడుతూ సమాజం కోసం అసువులుబాసిన అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుందామని అన్నారు. శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని ఎన్‌.టి.ఆర్‌. బ్లడ్‌బ్యాంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఐశ్వర్యరస్తోగీ, డి.ఎస్‌.పిలు ఎస్‌.శేఖర్‌, ఆర్‌.శ్రీనివాస్‌, యూనిట్‌ డాక్టర్‌ గోదాదేవి,  సి.ఐ.లు నాగేశ్వరరావు, వెంకటరమణ, మన్మథరావు సిబ్బంది పాల్గొన్నారు.

related posts