Home NewsDevotional మహిషాసుర మర్దినిగా దుర్గమ్మ

మహిషాసుర మర్దినిగా దుర్గమ్మ

by kishore226226@gmail.com
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. కనకదుర్గ అమ్మవారు ఈరోజు మహిషాసుర మర్దిని దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 3గంటల నుంచి అమ్మవారి దర్శనం ప్రారంభమైంది. పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వినాయక ఆలయం నుంచి క్యూలైన్లు ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అంతరాలయ దర్శనం నిలిపివేశారు. అలాగే 100, 300 రూపాయల టికెట్ల విక్రయం రద్దు చేశారు. భక్తులను సాధారణ క్యూలైన్లతో పాటు ముఖ మండప దర్శనానికి అనుమతిస్తున్నారు.
భక్తుల రద్దీ కారణంగా ఇంద్రకీలాద్రి పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దుర్గగుడికి వెళ్లే మార్గంలో వాహనాలను నియంత్రిస్తున్నారు. పండిట్ నెహ్రూ బస్టాండ్, పోలీస్ కంట్రోల్ రూం, భవానీపురం వద్దే వాహనాలు ఆపివేస్తున్నారు. దీంతో భక్తులు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి క్యూలైన్లలోకి ప్రవేశిస్తున్నారు. మరోవైపు దసరా కావటంతో భవానీ భక్తులు దీక్షా విరమణ కోసం పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. దుర్గాఘాట్‌లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. ఇవాళ ఉదయం 11గంటల వరకు మాత్రమే అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో దర్శనమివ్వనున్నారు. ఆ తర్వాత రెండు గంటల పాటు దర్శనం నిలిపివేసి.. అమ్మవారిని రాజరాజేశ్వరిదేవిగా అలంకరించి మధ్యాహ్నం 1గంట నుంచి దర్శనం మళ్లీ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు జరిగే పూర్ణాహుతితో దసరా ఉత్సవాలు లాంఛనంగా ముగియనున్నాయి

related posts